సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో బుధవారం వృధ్ధుల దినోత్సవం సందర్బంగా తాడేరు రోడ్డులో వున్న వృధ్ధుల ఆశ్రమంలో 1వ అదనపు సివిల్ జడ్జి శ్రీమతి P.హనీష అధ్యక్షతన న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.న్యాయమూర్తి మాట్లాడుతూ “కని, పెంచి, విధ్యాబుద్దులు నేర్పించిన తల్లిదండ్రులను వృధ్ధాప్యంలో చూడవలసిన నైతిక బాధ్యత పిల్లలపై ఉంటుందని, పిల్లలు ఉండి కూడా వృధ్ధాశ్రమంలో ఉండవలసిరావడం చాలా బాధాకరమని, తల్లిదండ్రులు పిల్లల నుండి మనోవర్తి కోరవచ్చని, వృధ్ధుల హక్కుల పరిరక్షణకు మండల న్యాయ సేవా సంస్ధను సంప్రదించవచ్చని” అన్నారు.న్యాయమూర్తి చేతుల మీదుగా వృధ్ధులకు పళ్ళు, స్వీట్స్ పంచారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు యేలేటి యోహాను (న్యూటన్), ప్యానల్ న్యాయవాదులు M.B.భవాని, D.రవికిరణ్, 1వ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ M.నాగరాజు, పారా లీగల్ వాలంటీర్ K.చంద్రరావు, వృధ్ధాశ్రమం నిర్వాహకులు సత్యనారాయణరాజు, రవి తదితరులు పాల్గొన్నారు.
