సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం దేవీ శరన్నవరాత్రుల ముగింపు సందర్బంగా నేడు, శనివారం , సాంప్రదాయం ప్రకారం భక్తులకు పెద్ద ఎత్తున నిర్వహించిన అన్న ప్రసాద సంతర్పణ కార్యక్రమాన్ని, శ్రీ అమ్మవారికి ప్రత్యేక పూజలు అనంతరం.. శాసన సభ్యులు పులపర్తి రామాంజనేయులు ప్రారంబించారు. సుమారు 15000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. శ్రీ అమ్మవారి దయతో గత 14 రోజులుగా నిర్విఘ్నంగా ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ ఆధ్వర్యంలో సిబ్బంది సమిష్టిగా శ్రమించి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండాకార్యక్రమలు విజయవంతం చేశారు. గతం కంటే ఒక మెట్టు పైనే ఈ దసరా వేడుకలలో ప్రతిరోజూ వివిధ వైదిక కార్యక్రమాలుతో పాటు ప్రత్యేక చండీ హోమం, లక్ష కుంకుమార్చన..నిర్వహణ తో పాటుగా.. మధ్యాహ్నం 2 గంటలకు భజనలు, 4 గంటలకు భక్తి సంగీతం, 6-30 కి శ్రీ అమ్మవారు అలంకరణ విశేషం ఫై ప్రసంగం.. 7 నుండి కూచిపూడి వంటి సంప్రదాయం సాంస్కృతిక కళా ప్రదర్శన లు.. మాటాడే బొమ్మ, మేజిక్ షో తదితర ఆనందోత్సాహాలు ఉత్సవ నిర్వహణ అధ్యంతం సమర్ధవంతంగా జరిపించారు.. పందిళ్ళలో వాటర్ ప్రూఫ్ పెండల్స్. గాలి కోసం ఫ్యాన్లు కూడా వేసామని.. అలానే పోలీస్ అధికారులు, మున్సిపల్ అధికారులుకు , స్వచ్చంద మహిళా సేవకులు కు అసిస్టెంట్ కమీషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ కృతజ్ఞలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *