సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పాన్ ఇండియన్ సూపర్ స్టార్ గా ఎదిగిన భీమవరం బ్రాండ్ ప్రభాస్ (Prabhas).. ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా భారతీయ సినిమా వేల కోట్లను కొల్లగొట్టే కోట ద్వారాలు తెరిచాడు. ప్రస్తుతం మారుతీ (Maruthi ) దర్శకత్వంలో ‘ది రాజాసాబ్’ సినిమా చేస్తున్నా రు. వచ్చే ఏడాది జనవరి 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. అలాగే హను రాఘవపూడి నిర్మిస్తున్న పౌజీ సినిమా 2వ ప్రపంచ యుద్ధం నాటి కథ తో అభిషేక్ బచ్చన్ కీలక రోల్లో నటిస్తుండగా షూటింగ్ పూర్తీ చేసుకొంటుంది. సమ్మర్ కు రిలీజ్ కు సిద్ధం కానుంది. ఇక కల్కి 2 సినిమా షూటింగ్ ప్రభాస్ లేని సన్నివేశాలు చిత్రీకరణ ప్రారంభం అయ్యింది. త్వరలో ప్రభాస్ జాయిన్ అవుతారు. ఇక సంచలన దర్శకుడు సందీప్ వంగా ‘స్పిరిట్’ షూటింగు నవంబర్ 5 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో కీలకమైన రోల్ లో రక్త చరిత్ర పేమ్ వివేక్ ఓబ్రాయి ఫైనల్ అయినట్లు సమాచారం. ప్రభాస్ తొలిసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారు. అలాగే ఇందులో అంతర్జాతీయ నటుడు మడోన్నా సెబాస్టియన్ కూడా కీలకపాత్ర పోషించబోతున్నారు. ఇందులో ప్రభాస్ తండ్రిగా ఒక ప్రముఖ హీరో నటించే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *