సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కర్ణాటకలో జరిగిన అమృత మోహోత్సవం కార్యక్రమానికి నేడు, మంగళవారం ముఖ్య అతిధిగా వెళ్ళారు పవన్ కళ్యాణ్. కన్నడ భాషకు, అక్కడి ప్రజలకు గౌరవాన్ని ఇస్తూ అరగంట పాటు ఆగకుండా కన్నడ భాషలో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. దీంతో, పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. కర్ణాటక లో తెలుగు ప్రజలపై, తెలుగు సినిమాలపై దాడులు జరిగినప్పటికీ కఠినంగా ఉండకుండా.. పవన్ కర్ణాటక తో మంచి అనుబంధం కొనసాగిస్తున్నారని అక్కడి వారు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇటీవల అక్కడ కాంగ్రెస్ సర్కార్ తో మాట్లాడి ఏనుగులను కూడా ఆంధ్ర లోని చిత్తూరుకు రప్పించారు పవన్, దీనిపై కర్ణాటకలో పెద్ద ఎత్తున ఉన్న తెలుగు ప్రజలే కాదు కన్నడ ప్రజలు సైతం పవన్ కళ్యాణ్ ఒక వారధిగా పనిచేస్తున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *