సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో తమకు వికలాంగ పెన్షన్ రావట్లేదని , పాతది తొలగించారని తీవ్ర ఆవేదన చెందుతున్న వారి కోసం ఏపీలోని కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీం కింద గతంలో దివ్యాంగుల పెన్షన్ రద్దైనా లేదంటే పెన్షన్ రకం మార్పు నోటీసులు అందుకుని అప్పీల్ చేసుకున్న వారికి మరోసారి నేటి బుధవారం నుండి అంటే ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీవరకు మూడు రోజులపాటు రీ అసెస్మెంట్ నిర్వహిస్తున్నారు.ఈ టెస్టుల ప్రక్రియలో పాల్గొన్న వికలాంగ శాతం 85శాతం పైబడిన వైకల్యం ఉన్నవారికి, మంచానికి పరిమితమైన వారికి రూ.15వేలు అందిస్తారు. 85శాతం కంటే తక్కువ ఉండి 40శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి రూ.6వేలు అందజేస్తారు. అదేవిధంగా 40శాతం కంటే తక్కువ వైకల్యం ఉంటే రూ.4వేలు ప్రతీనెలా ప్రభుత్వం అందిస్తుంది
