సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో వున్న కేసుల పరిష్కారం నిమిత్తం భీమవరంలో వున్న అన్ని కోర్టుల్లో డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని, కక్షిదారులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కేసులు పరిష్కరించుకోవాలని” మీడియా సమావేశంలో .. భీమవరం 3వ అదనపు జిల్లా జడ్జి మరియు మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్ గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి B.లక్ష్మి నారాయణ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్ధల ఆదేశాల మేరకు ఈ నెల 18న అసంఘటిత కార్మికులు మరియు బాలల కొరకు ప్రవేశ పెట్టిన పధకాలపై అవగాహన కల్పించుటకు ఒక న్యాయ సేవా సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతుందని, జిల్లా రెవిన్యూ శాఖ, DRDA, లేబర్ డిపార్ట్మెంట్, మహిళా శిశు సంక్షేమ శాఖ, విద్యా శాఖ, పోలీస్, మునిసిపల్ శాఖల అధికారులు ఈ సదస్సు లో భాగమవుతారని, ఈ కార్యక్రమం ప్రజలలోకి తీసుకు వెళ్ళడానికి టూకే వాక్ కార్యక్రమం నిర్వహించే ఆలోచన ఉందని” అన్నారు.ఈ ప్రెస్ మీట్ లో సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) M.సుధారాణి, ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) G.సురేష్ బాబు, 1వ అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) P.హనీష, 2వ అదనపు జుడీషియల్ మొదటి తరగతి మేజిస్ట్రేట్ N.జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.
