సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చదువుతోపాటు దేశభక్తి మన సంస్కృతి పట్ల ఆసక్తి కలిగేలా విద్యార్థులను ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలి.సమాజ దేవాలయానికి నిజమైన రక్షకుడు ఉపాధ్యాయులే అని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. ఆయన నేడు, శనివారం భీమవరం డివిజన్ లో 45 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కార కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు తో కలసి పాల్గొన్నారు. స్థానిక భీమవరం డిఎన్నార్ రామకృష్ణ సభ భవనంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భీమవరం డివిజన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో భాగంగా డివిజన్ లోని 45 మంది ఉత్తమ ఉపాధ్యాయులను కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిఎన్నార్ కళాశాల కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణ రాజు (బాబు), ఉపాధ్యక్షులు గోకరాజు పాండు రంగరాజు, ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ స్టేట్ అడిషనల్ జనరల్ సెక్రెటరీ సుంకర మాణిక్యాలరావు, గౌరవ అధ్యక్షులు ఎం జనార్ధన్, రాష్ట్ర అధ్యక్షులు వి సుబ్రహ్మణ్య రాజు, మాజీ అధ్యక్షులు వి సుందర్ రామ్, మామిడిశెట్టి ఏడుకొండలు, హరి రాఘవేంద్ర సింగ్, నందమూరి రాజేష్, తాళ్లపూడి దుర్గంజలి కుమారి, సుభద్రా దేవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *