సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల నైరుతి రుతుపవనాలు నిష్క్రమించి, ఈశాన్య రుతుపవనాల రానున్నాయి. దక్షిణాదిలో పలు రాష్ట్రాలు తప్ప దేశంలో అనేక ప్రాంతాల్లో ఆకాశం నిర్మలంగా మారి పొడి వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ నెల 16వ తేదీన దక్షిణాదిలోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించనున్నాయని వాతావరణ నిపుణులు ప్రకటించారు. దక్షిణ తమిళనాడుకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో సోమవారం ఏపీలో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు, కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న సాయంత్రం నుండి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భీమవరంలో గత సాయంత్రం భారీ వర్షం కురిసింది. అలాగే నేటి సోమవారం తెల్లవారు జాము నుండి తడవ తడవలుగా భారీ వర్షం కురుస్తూనే ఉంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నేడు రాత్రి వరకు ఈ వర్షపు ముసురు కొనసాగే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *