సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చైనా ఫై నవంబర్ 1 నుండి 100 శాతం సుంకాలు పెంచుతున్నట్లు అమెరికా అడ్జక్షుడు ట్రంప్ మొన్న ప్రకటించడంతో నేడు, సోమవారం తెరచుకొన్న ఆసియా స్టాక్ మార్కెట్ ఫై ముందుగా ఊహించినట్లే నష్టాలతో ప్రారంభం అయ్యింది. ఇదే ప్రభావం మన భారత్ ఫై కూడా పడింది. నేడు సోమవారం దేశీయ మార్కెట్ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. చమురు, సహజ వాయువు రంగాల షేర్ల నష్టాలు,సూచీలపై ప్రతికూల ప్రభావం చూపించాయి. మార్కెట్ ప్రారంభమైన కాసేపటికి సెన్సెక్స్ 418 పాయింట్లు నష్టపోయి 82,000 వద్ద, నిఫ్టీ 125 పాయింట్లు కోల్పోయి 25,200 వద్ద ట్రేడ్ అయ్యింది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 88.76గా ఉంది అయితే ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్ లాభాలు బాటలో ఉన్నాయి. అమెరికా మార్కెట్‌ నుంచి జనరిక్ ఔషధాలకు డిమాండ్ యథాతథంగా కొనసాగుతుండటంతో ఫార్మా షేర్లకు డిమాండ్ బాగానే ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *