సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కడప రైల్వే స్టేషన్ సమీపంలోని 3వ నంబర్ ట్రాక్‌పై జరిగిన విషాదం నేడు, సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. గత ఆదివారం రాత్రి 11 గంటల తర్వాత, వేగంగా దూసుకువస్తున్న గూడ్స్ రైలుకు ఎదురుగా నిలబడి ఆ కుటుంబం క్షణికమైన ఆవేశంలో ఆత్మహత్య చేసుకుంది. రైలు ఢీకొట్టడంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భార్య భర్తలు శ్రీరాములు, శిరీష ఏదో విషయంలో గొడవ పడ్డారు. దీంతో శ్రీరాములు నాన్నమ్మ సుబ్బమ్మ వాళ్లను తీవ్రంగా మందలించింది. దీంతో మనస్థాపం చెందిన శ్రీరాములు భార్యాపిల్లలతో ( ఏడాదిన్నర చిన్నారితో) కలిసి తాము ఇక బ్రతకమని చెప్పి బయటకు వెళ్లిపోయాడు. అది తట్టుకోలేక సుబ్బమ్మ వారు వెళ్లిపోయిన కొద్దిసేపటికే గుండెపోటుతో కన్నుమూసింది. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన శ్రీరాములు కుటుంబం.. కాసేపటికే గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకొన్నారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా విషాదంగా మారింది.
