సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం నందమూరి రామారావు వారసుడిగా ఇప్పటికే ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గం నుండి వరుసగా 3 సార్లు గా గెలిచిన కూడా ఆయనకు మంత్రి పదవి రాకపోవడం ..ఇటీవల జరుగుతున్నా పరిణామాలు నేపథ్యంలో ఎట్టి పరిస్థితులలో ఆయనకు మంత్రి పదవి సాధించాలని చాపక్రింద నీరుగా బాలయ్య సన్నిహితులు అభిమానులు పట్టుదల గా కృషి చేస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య గత 3 రోజులుగా హిందూపూర్ నియోజకవర్గంలో పర్యటించి ప్రజలను అభిమానులను సమస్యలు అడిగి తెలుస్తూకొంటున్నారు. నేడు, సోమవారం బాలయ్య కిరికెర పంచాయతీలో పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున బాలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని వారంతా డిమాండ్ చేశారు. మంత్రి పదవి తీసుకోవాలని అభిమానులు ప్లకార్డులు తీసుకొచ్చి నినాదాలు చేశారు.మరోచోట డి బసవనపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో అదనపు గదులు, బీటీ రోడ్డును రిబ్బన్ కట్ చేసి ఎమ్మెల్యే ప్రారంభించారు.. బిటి రోడ్డు ప్రారంభోత్సవం అనంతరం ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్యే బాలకృష్ణ మంత్రి పదవి తీసుకోవాలని బాలయ్య కాన్వాయ్‌ను అడ్డుకొని నినాదాలు చేశారు. వెంటనే స్పందించిన బాలయ్య మీరేమి నిరాశ పడకండి..’నాకు అవసరమైనప్పుడు మంత్రి పదవి వస్తుందని.. ఓపిక పట్టాలని‘ అంటూ అభిమానులను ఉత్సహపరిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *