సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లిక్కర్ కేసులో ఏ4 నిందితుడుగా ఉండి, ఇటీవల బెయిల్ ఫై విడుదలయిన వైసీపీ ఎంపీ. మిథున్ రెడ్డి కి చెందిన ఏపీలోనూ, హైదరాబాద్, బెంగళూరు లోను ఆయన నివాసాలతో పాటు కార్యాలయాల్లో ఏపీ సిట్ అధికారులు నేడు, మంగళవారం ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్, ప్రశాసన్ నగర్, యూసుఫ్ గూడ గాయత్రీహిల్స్‌లోని మిథున్ నివాసాల్లో సిట్ బృందం సోదాలు చేస్తోంది. అలాగే కొండాపూర్‌లోని కార్యాలయంలోనూ సిట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇదిలా ఉండగా.. ఈనెల 20 నుండి వైసీపీ ఎంపీ మిదున్ రెడ్డి ని కేంద్రంలోని మోడీ సర్కార్ అమెరికాలోని ‘ఐక్యరాజ్య సమితి‘ లో భారత్ తరపున మాట్లాడే ఎంపీల కమిటీలో సభ్యుడిగా పంపుతుండటం మరో విశేషము. తాను అమెరికా వెళ్లాలంటూ 27న యూఎస్‌లో జరిగే భేటీలో పాల్గొనాల్సి ఉందని.. అనుమతి కావాలని ఎంపీ మిథున్ రెడ్డి ఇటీవల ఏసీబీ కోర్టు పిటిషన్ వేశారు. దీనిపై నేడు, మంగళవారం న్యాయస్థానం విచారించనుంది. ఈ నేపథ్యంలో ఏపీ సిట్ అధికారుల దాడులు ఆసక్తి రేపుతున్నాయి.
