సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం కాస్మో పాలిటిన్ క్లబ్ లో ఏర్పాటు చేసిన భీమవరం సూపర్ జిఎస్టి బెన్ఫిట్ బజార్ ను ఎమ్మెల్యే అంజిబాబు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ప్రారంభించారు. ముందుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్ ను స్వయంగా సందర్శించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. 5 రోజులపాటు జరిగే ఈ ప్రదర్శనను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, బజార్లో వివిధ వస్తువులను తగ్గింపుపై అమ్మకాలను చేపట్టడం జరుగుతుందన్నారు. ఉదయం 10:00 గంటల నుండి రాత్రి 9:00 గంటల వరకు బజాజ్ తెరిచి ఉంటుందని, ప్రవేశం ఉచితమన్నారు. దీపావళికి ముందు ఈ ఉత్సవం నిర్వహించడం ద్వారా పన్ను సంస్కరణలపై ప్రజలకు మరింత అవగాహన పెరుగుతుందన్నారు. భీమవరం సూపర్ జీఎస్టీ బెన్ఫిట్ బజార్ లో ఎలక్ట్రానిక్స్, ఉపకరణాలు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు, హస్తకళలు, చేనేత, వస్త్రాలు, ఫ్యాషన్ వస్తువులు, గృహోపకరణాలు, పుస్తకాలు, స్టేషనరీ, వ్యవసాయ పరికరాలు, వ్యవసాయ యంత్రాలు, గృహాలంకరణ, ఫర్నిచర్, పర్యాటకం, ఆతిథ్య ప్రదర్శనలు, ఆటోమొబైల్, తదితర వస్తువులను మెగా డిస్కౌంట్ తో అమ్మకాలు జరుగుతాయన్నాయని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, రెడ్డి తహశీల్దార్, అసిస్టెంట్ కమిషనర్, జీఎస్టీ అధికారులు, ఛాంబర్ అఫ్ కామర్స్ కమిటీ వారు కూటమి నాయకులు కార్యకర్తలు,మహిళలు తెలుగు మహిళలు పాల్గొన్నారు.
