సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ, బివి రాజు కాలేజీ, విద్య సంస్థల వ్యవస్థాపకుడు బివి రాజు గారి 105వ జన్మదిన నేపథ్యంలో భీమవరం నియోజవర్గ పరిధిలో శ్రీ విష్ణు విద్య సంస్థల డైరెక్టర్స్ , అధ్యాపక సిబ్బంది మరియు విద్యార్థుల తో పలు స్వచ్చంద కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా కాలేజీలోని అయన సమాధికి నివాళ్లు అర్పించి, ఒక సాధారణ స్థితి నుండి ఒక ప్రముఖ ఇంజనీర్ గా ఆసియా ఖండంలోనే ఎన్నో సిమెంట్ ఫ్యాక్టరీలు నిర్మించి, ఒక అత్యున్నత పారిశ్రామిక వేత్తగా , విద్య సంస్థల అధినేతగా, ఎందరినో అభాగ్యులను ఆదుకున్న ఉదారవాదిగా బివి రాజు ఎదిగిన తీరు అధ్యాపకులు విద్యార్థులకు స్ఫూర్తి దాయకము గ వివరించారు. బివి రాజు చౌక్ లో విగ్రహానికి పూలమాలలు వేశారు. తదుపరి బివి రాజు స్వగ్రామం కుముదువల్లి గ్రామంలో నాలెర్జ్ సెంటర్ మరియు, కొవ్వాడ గ్రామంలో పేదలకు పండ్లు, బ్రేడ్, పాలు పంపిణి చేసి స్థానిక సెంటిమెరీస్ హోస్పేటలో పేద రోగులకు 60వేల రూ పైగా విలువైన మందులను పంపిణి చేసి , శృంగవృక్షం , తాడేరు లలోని కుష్టువ్యాధి రోగులకు ప్రతి ఒక్కరికి బియ్యం బస్తాలు, మాపిల్స్, బిస్కెట్స్ మరియు పట్టణంలోని పలు ప్రాంతాలలో చదువుతున్న 20 మంది పేద విద్యార్థులకు 83 వేల రూపాయల మెరిట్ స్కాలర్ షిప్ లు అందజేశారు. యింకా పలు ప్రాంతాలలో పలు స్వచ్చంద సేవ కార్యక్రమాలు నిర్వహించారు.
