సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రానున్న దీపావళి పండుగల(Diwali ) సందర్భంగా ప్రయాణికుల రద్దీని అధిగమించేందుకు ఈనెల17, 18 తేదీల్లో వేర్వేరు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధికారులు నేడు, గురువారం ఓ ప్రకటనలో తెలియజేశారు. వీటిలో హైదరాబాద్ వైపు నుండి భీమవరం టౌన్ మీదుగా.. అక్టోబర్ 17న చర్లపల్లి నుండి అనకాపల్లి(07097), మరియు 18న అనకాపల్లి నుండి చర్లపల్లి కి వెళ్లే రైలు పశ్చిమ గోదావరి జిల్లా లోని ఆకివీడు, భీమవరం టౌన్ తణుకు ల మీదుగా వెళ్లనుంది. ప్రయాణికులు గమనించగలరు.
