సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:ఇటీవల లక్కీ నిర్మాతగా పేరొందిన బన్నీ వాసు సమర్పణ లో ప్రియదర్శి, నిహారిక సరికొత్త నటీనటులుతో పాటు సత్య, విటివి గణేష్, వెన్నెల కిషోర్ తదితరులు తో నూతన దర్శకుడు, విజయేందర్ సారధ్యంలో నేడు, గురువారం మిత్ర మండలి’ సినిమా ప్రేక్షకుల ముందుకు యూత్ టార్గెట్ గా రిలీజ్ అయ్యింది. మరి వారి టార్గెట్ రీచ్ అయ్యిందా? మిత్ర మండలి మొదలయ్యే ముందు టైటిల్ కార్డ్స్‌లోనే కథలేని కథ అని వేస్తారు, మరి లాజిక్స్ లేని సినిమాలో ఉన్న కధ విషయానికి వస్తే.. జంగ్లీ పట్నంలో నారాయణ (వీటివి గణేష్) తుట్టె కులంలో ఒక పెద్ద మనిషి. కులం కోసం ప్రాణం ఇస్తాడు, తన కులం ఓట్లు వాడుకొని ఎమ్మెల్యే కావాలి అనుకుంటాడు. అదే సమయంలో ఆయన కూతురు స్వేచ్ఛ (నిహారిక) ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. కూతురు లేచిపోయింది అంటే కులపు ఓట్లు దూరమవుతాయని కిడ్నాప్ అయిందని నాటకం ఆడుతాడు నారాయణ. అదే సమయంలో అమ్మాయిని తీసుకెళ్ళింది చైతన్య (ప్రియదర్శి), అభి (రాగమయుర్), సాత్విక్ (విష్ణు), రాజీవ్ (ప్రసాద్ బెహరా) అనే నలుగురు కురాళ్ళ బేవార్స్ గ్యాంగ్ అని తెలుసుకొంటాడు. అక్కడ నుండి వారితో పడే పాట్లు ఈ కధ .. ఇక కామిడి సినిమా ఎలా ఉందంటే ఒక్క ముక్క లో చెప్పాలంటే..సహజంగా నవ్వు రాదు.. కస్టపడి నవ్వవలసిన సినిమా.. అంతే.. కథ లేకుండా నవ్వించడం అనేది ఇంకా కష్టం.. ప్రేక్షకులకు సోది.. సుత్తి కొట్టడం అన్నిసార్లు వర్కవుట్ అవ్వదు.మిత్ర మండలి విషయంలోనూ ఇదే జరిగింది.. ఉన్నంతలో, సత్య మాత్రమే ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటూ వచ్చి నవ్వించాడు.. వెన్నెల కిషోర్‌తో సత్య కాంబో సీన్స్ బాగున్నాయి. మిగిలిన వాళ్లలో ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేదు.. హీరో ప్రియదర్శిని కూడా సరిగ్గా వాడుకోలేకపోయాడు దర్శకుడు విజయేందర్. ఇందులో కథతో పాటు అక్కడక్కడా కులాలపై పంచులు కూడా వేసాడు దర్శకుడు.నిహారిక పర్లేదు. అనుదీప్ కె.వి ఉన్నది ఒక్క సీన్ అయినా కూడా నవ్వించాడు.మిత్ర మండలికి ప్రేక్షకులు ఆదరణ అనుమానమే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *