సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం ఏపీలో కర్నూల్ జిల్లా పర్యటనలో భాగంగా నేటి మధ్యాహ్నం నన్నూరులో ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్‘ బహిరంగసభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు , పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ప్రసంగించారు. ప్రధాని మోడీ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. ఈ సభలో సోదర, సోదరీమణులకు నమస్కారం ఏపీ ఆత్మగౌరవం ఉన్న రాష్ట్రము అని..ప్రాచీన సంస్కృతికి నిలయంగా ఉందని అభివర్ణించారు. ఏపీలో అనంత అవకాశాలు ఉన్నాయని ఉద్ఘాటించారు. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలోనూ యువశక్తి ఉందని నొక్కిచెప్పారు. గత 16 నెలల్లో రాష్ట్రంలో అభివృద్ధి డబుల్‌ ఇంజిన్‌లా దూసుకుపోతోందని కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఏపీకి సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు. కేంద్రం జీఎస్టీ తగ్గించి సామాన్య ప్రజలకు ధరలు తగ్గించి మేలు చేసిందని నేడు ద్వితీయ జ్యోతిర్లింగమైన శ్రీశైలం శ్రీ మల్లికార్జునస్వామి ఆశీస్సులు పొందానని అన్నారు. 2047 నాటికి మన దేశం వికసిత్‌ భారత్‌గా మారుతుంది. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ…కేవలం 16 నెలల కాలంలో ప్రధాని మోదీ 4 పర్యాయాలు రాష్ట్రానికి వచ్చారుఅని, ఇప్పటికే విశాఖకు వచ్చి రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు అన్నారు.అమరావతి రీస్టార్ట్ కార్యక్రమానికి వచ్చి రూ.58 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. తాజాగా.. ఇప్పుడు రూ.13,430 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జాతికి అంకితం చేస్తున్నారు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *