సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో డీఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఏఐ&డీఎస్ (AI&DS) విభాగాధిపతి కె. సూర్య రాంప్రసాద్ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాకర డా. సర్వేపల్లి రాధాకృష్ణ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు- 2025 అందుకోవడం తమ విద్య సంస్థ కు గర్వకారణం అని కళాశాల సెక్రటరీ & కరెస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణ రాజు (బాబు) , కళాశాల ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు లు నేడు, గురువారం హర్షం వ్యక్తం చేసారు.. సొసైటీ ఫర్ లెర్నింగ్ టెక్నాలజీ సంస్థ ఈ అవార్డుల ప్రదానోత్సవాన్ని విజయవాడలోని హోటల్ మిస్వారా గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించింది. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాక, పలు దేశాల నుంచి సుమారు 200 మంది ప్రొఫెసర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.వారిలో డి ఎన్ ఆర్ కు చెందిన కె. సూర్య రాంప్రసాద్ అవార్డును భారత ప్రభుత్వ ఏఐసీటీఈ (AICTE) యొక్క చీఫ్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ మరియు విద్యా మంత్రిత్వ శాఖ అనుబంధ సంస్థ ఏఐ సీఈఓ (AI CEO) డా. బుద్ధ చంద్రశేఖర్ మరియు ఆంధ్ర రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్. విజయభాస్కర్ గార్ల చేతుల మీదుగా అందుకున్నారు.ఈ సందర్భంగా నేడు, కళాశాలలో జరిగిన అభినందన సత్కార సభలో కళాశాల ప్రిన్సిపల్ డా. ఎం. అంజన్ కుమార్ కళాశాల డీన్స్, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు
