సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచ వ్యాప్తంగా బంగారం (Gold) కొనుగుళ్ళు పెరగటంతో, దీపావళి పండుగ దృష్ట్యా దేశంలో బంగారం ధరలు తరాజువ్వలాల దూసుకొనిపోతున్నాయి. తాజాగా మరోసారి బంగారం, వెండి ధరలు పెరిగాయి. నేడు,శుక్రవారం ఒక్క రోజులోనే 10 గ్రాముల బంగారం రూ.3,770 పెరిగింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో విజయవాడ, హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,180 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,690గా ఉంది. విజయవాడ, హైదరాబాద్‌లో 1 కిలో వెండి (silver) ధర రూ.1,85,000గా పెరిగిపోయింది.
