సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: డీజే టిల్లు, టిల్లు స్క్వేర్’ సినిమాలతో వరుస హిట్స్ అందుకున్నయువ హీరో సిద్ధు జొన్నలగడ్డను ‘జాక్’ సినిమా బాగా నిరాశ పర్చింది. అయితే ఈసారి రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి తో జంటగా ‘తెలుసు కదా’ మూవీ తో నేడు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నీరజ కోన ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ, ఈ మూవీని మిరాయ్‘ లాంటి సూపర్ హిట్ తరువాత పీపుల్స్ మీడియా వారు నిర్మించారు. ఇక సినిమా కధ విషయానికి వస్తే.. వరుణ్‌ (సిద్ధు జొన్నలగడ్డ) ఎవరూలేని ఓ అనాధ. అతని స్నేహితుడు అభి (వైవా హర్ష). ఇద్దరూ చిన్నప్పుటి నుంచి కలిసే పెరుగుతారు. మొదటి నుండి తనకంటూ ఓ సొంత కుటుంబం ఉండాలని కలలుకంటూ ఉంటాడు సిద్ధు. తన ప్రమేయం లేకుండానే జరిగిన ఓ బ్రేకప్ తర్వాత బుద్థిగా అంజలి (రాశీఖన్నా)ని పెళ్లి చేసుకుంటాడు వరుణ్. పెళ్ళి అయిన కొన్ని నెలలకే అంజలికి పిల్లలు పుట్టరనే విషయం తెలుస్తుంది. దాంతో సరోగసీ ద్వారా పిల్లలను కనాలని . అందుకోసం రాగ కుమార్ (శ్రీనిధి శెట్టి) అనే డాక్టర్ ముందు వచ్చి వరుణ్, అంజలికి తాను బిడ్డ కంటానని చెబుతుంది.అక్కడి నుండి జరిగే ట్విస్ట్లు తెరపై చూడవలసిందే. ముక్కోణ ప్రేమకథ కంటే కూడా పెళ్ళైన తర్వాత ఓ యువకుడి జీవితంలో జరిగిన విచిత్రమైన సంఘటనలను బేస్ చేసుకుని సాగే కథ ఇది. ఫస్ట్ హాఫ్ చాల ఆసక్తికరంగా సాగినా.. సెకండ్ హాఫ్ లో డ్రామాను పక్కన పెట్టేసి, డైలాగ్స్ మీద సినిమా వెళ్లిపోవడంతో యూత్ అంచనాలు అందుకోలేకపోయింది. తొలిసారి సిద్ధు జొన్నలగడ్డ మెచ్యూర్డ్ పాత్ర బాగానే చేసాడు. లైఫ్ ఎంజాయ్ చేసే పాత్రలో శ్రీనిధి శెట్టి బాగానే చేసింది. రాశీ ఖన్నా పాత్ర హుందాగానే సాగినా సెకండ్ హాఫ్ లోని కాస్త తగ్గింది. హీరో స్నేహితుడిగా వైవా హర్ష బాగా రాణించాడు. మొత్తానికి సినిమా ఈ 4 పాత్రలతో నడిపేసారు. ఎస్. థమన్ స్వరపర్చిన ‘మల్లిక గంథ’ సాంగ్ అదుర్స్..విభిన్న కథను తన స్క్రీన్ ప్లేతో దర్శకురాలు నీరజ కోన మంచి ప్రయత్నం చేసింది. కానీ ‘తెలుసు కదా’ అని హీరో ఎంత చెప్పినా.. ఎక్కడో బలమైన పీల్ మిస్సయింది. నిర్మాతలు మాత్రం రిచ్ గా సినిమా తీశారు. సినిమా ఒకేసారి చూసేయచ్చు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *