సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం, తిరుమల శ్రీవారి సేవా టిక్కెట్లు ఏర్పాటు చేస్తామని దళారులు భక్తులను మోసం చేసిన ఘటనలు కోకొల్లలు జరుగుతున్నా నేపథ్యంలో తాజగా హోంమంత్రి, వంగలపూడి అనిత పేరుతొ టీటీడీ అధికారుల పేరు చెప్పి భక్తులను బురిడీ కొట్టించాడు అశోక్ అనే దళారీ లక్షలాది స్కాం విషయం వెలుగులోకి వచ్చింది. తాజగా జరిగిన దోపిడీలో గూగుల్ పే, ఫోన్ పే ద్వారా భక్తుల నుంచి దాదాపు 4 లక్షల 10వేల రూపాయలు వరకు వసూలు చేశాడు దళారీ. అయితే డబ్బులు తీసుకున్న వెంటనే ఫోన్ ఆఫ్ చేసి దళారీ పరారయ్యాడు. అయితే దళారీ చేతిలో మోసపోయమని గ్రహించిన తెలంగాణకు చెందిన బజ్రంగ్ అమన్ గోయల్.. విజిలెన్స్ వింగ్‌ను ఆశ్రయించాడు. దళారీ మోసం గురించి ఈ మెయిల్ ద్వారా టీటీడీ విజిలెన్స్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు . విజిలెన్స్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దళారులను నమ్మవద్దని శ్రీవారి భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ అధికారులు హెచ్చరిస్తున్నారు
