సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్లో వానలు కురుస్తున్నాయి. ఈ నెల 17వ తేదీన బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారి మరింత తీవ్రరూపం దాల్చిందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. ఎల్లుండి గురువారం నాటికి దక్షిణమధ్య, పశ్చిమమధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో తీవ్ర వాయుగుండం ఏర్పడిన సమయంలో కోస్తా ఆంధ్ర తీరంలోని సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లకూడదని, ఇప్పటికే సముద్రం మీదికి వెళ్లిన వాళ్లు తిరిగి రావాలని కీలక సూచనలు చేశారు. తీర ప్రాంతాల్లో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పేర్కొన్నారు. ఈ తరుణంలోనే నేడు, మంగళవారం బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోభారీ వర్షాలు కురిసే అవకాశము ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
