సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం లో దీపావళి సంబరాలు వేడుకగా జరిగాయి. అయితే బాణసంచా ధరలు 50 నుండి 100 శాతం బాగా పెరగటం, కొబ్బరి కాయ మొదలు అన్ని పూజాద్రవ్యాలు పెరగటం, స్థానిక వ్యాపారాలు తగ్గటం ప్రజల కొనుగోలు శక్తి తగ్గడం వల్ల గతంలో వలె భారీ స్థాయిలో అర్ధరాత్రి వరకు బాంబు మోతలు లేవు ఆకాశంలో రంగుల హరివిల్లులు తగ్గాయి. అయితే గత రాత్రి 7గంటల కల్లా ఇంటింటా పుష్ప విద్యుత్ దీప అలంకారాలతో, శ్రీ లక్ష్మి పూజలు తో పాటు అందమైన దీపపు వెలుగులు కొలువు దీరాయి. పెద్దలు చిన్నారుల కోలాహలంతో ..స్థానికులతో పాటు మార్వాడీలు, బెంగాలీలు ఇళ్ళు లక్ష్మి కళతో మిఠాయిల పంపిణీలతో మరింత సందడిగ ఉన్నాయి. ఇక బాణాసంచా కాల్పులు తో ఆకాశం రంగు రంగుల కాంతుల అలంకారాలతో ప్రత్యక శోభ తో కనపడింది. దీపావళి రోజు తో సహా గత వారం రోజులలో ఒక్క రోజు తప్పపెద్దగా వర్షాలు పడకపోవడంతో పండుగ కు ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగింది, పట్టణంలోని పలు వైష్ణవ లక్ష్మి దేవాలయాలు తో పాటు గత సాయంత్రం, శ్రీ స్వర్ణ సాయి మందిర్, మారుతి సెంటర్ లోని శ్రీ బాబావారి మందిరాలలో దీపాలతో ప్రత్యేక అలంకరణలు చేసారు. పట్టణంలో ఎక్కడ ప్రమాదాలు లేకుండా ప్రశాంతగా వేడుక జరగటం విశేషం..
