సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగునాట లాస్ వెగాస్ గా పేరున్న భీమవరంలో జూదశాలలు ఫై రచ్చ ఎప్పుడు మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంటుంది. అయితే తాజా పరిస్థితులపై డెప్యూటీ సీఎం పవన్ సీరియస్ అయ్యారు. భీమవరం పరిధిలో ఇటీవల ఇటీవల నిబంధనలు కు విరుద్ధంగా క్లబ్ లు పేకాట శిబిరాలు పెరిగిపోయాయనీ, సివిల్ వివాదాలలో ఒక కీలక పోలీస్ అధికారి జోక్యం చేసుకొంటున్నారనీ, ఆయన కొందరి పక్షం వహిస్తూ కూటమి నేతల పేరును వాడుతున్నారనే తరహా ఫిర్యాదులు తన దృష్టికి వచ్చాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు, మంగళవారం మధ్యాహ్నం పశ్చిమ గోదావరి జిల్లా ‘ఎస్పీ అదాన్ హస్మి’ కి ఫోన్ చేసి మాట్లాడారు. తన దృష్టికి వచ్చిన ఫిర్యాదులు ప్రస్తావించి భీమవరంలో ఎవరి అనుమతితో ఈ క్లబ్ ల నిర్వహణ జరుగుతుంది? అసాంఘిక వ్యవహారాలకు ఉన్నత స్థాయి అధికారి అండగా ఉన్నారని? వస్తున్నా పిర్యాదులు తీవ్రంగా పరిగణించాలని, దీనిపై దర్యాప్తు చేసి అసలు వాస్తవాలు తెలపాలని,పోలీసులు సివిల్ వివాదాల్లో తలదూర్చకుండా చూడాలన్నారు. ఈ తరహా వ్యవహారాలను కూటమి ప్రభుత్వం ఉపేక్షించదనే విషయాన్ని సిబ్బందికి తెలియచేయాలన్నారు. ప్రజలందరినీ సమదృష్టితో చూసి శాంతిభద్రతలను పరిరక్షించాలని, ఎవరిని ఉపేక్షించవద్దని ఎస్పీ కి దిశానిర్దేశం చేశారు. భీమవరం ప్రాంత అనధికార క్లబ్ లపై ఆరోపణలను రాష్ట్ర హోమ్ శాఖ మంత్రికీ, రాష్ట్ర డీజీపీకి తెలియచేయాలని తన కార్యాలయ అధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *