సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజక వర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు.నేడు, బుధవారం ఉదయం భీమవరం మండలం యనమదుర్రు గ్రామంలో సుమారు రూ కోటి 80 లక్షలతో సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే అంజిబాబు శంకుస్థాపన చేశారు. యనమదుర్రు నుంచి దిరుసుమర్రు గ్రామం వరకు సీసీ రోడ్డు వేయడం జరుగుతుందని, పనులు తొందరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అన్ని గ్రామాల్లోనూ సీసీ రోడ్లు, డ్రెయిన్లు వేస్తున్నామన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, ఎఎంసీ వైస్ చైర్మన్ బండి రమేష్, వబిలిశెట్టి రామకృష్ణ, గ్రామస్థులు, కూటమి నాయకులు మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *