సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి లో పంచారామ క్షేత్రం లో వేంచేసి యున్న శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి వారి దేవస్థానం నందు నేడు, బుధవారం కార్తీక మాసం మొదటి రోజు సందర్భముగా.. స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, స్వామి దర్శనం అనంతరం కార్తీక మాసం అన్నదానం ప్రారంభించారు. తదుపరి రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి రఘురామా కృష్ణంరాజు కుమారుడు భరత్ శ్రీ స్వామి వారి దర్శనం చేసుకొన్నారు. ఈ కార్యక్రమాలలలో ఆలయ ఇఓ రామకృష్ణంరాజు మరియు చైర్మెన్ చింతలపాటి బంగార్రాజు మరియు ధర్మకర్తలు పాల్గొన్నారు. నేడు, ఆలయమునకు సుమారు 3000 మంది భక్తులు వరకు విచ్చేయగా విశిష్ట దర్శనం ద్వారా 5500/- కార్తీక మాసం నెల పూజలు ద్వారా 13,600/- వివిధ పూజల వలన 4,576/- రూపాయలు లడ్డు ప్రసాదం వలన 1,755/-రూపాయలు మొత్తం 25,431/- లు వచ్చినది శ్రీ స్వామివారి నిత్యాన్నదానము నందు కానుకల వలన 24,221/- రూపాయలు కానుకగా వచ్చాయని .దేవాలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు. నేటి సాయంత్రం శ్రీ సోమేశ్వరుని సుందర అలంకారం ఫై తాజా చిత్రంలో చూడవచ్చు.
