సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం బ్రాండ్ గా ప్రసిద్ధి పొందిన పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు నేడు, గురువారం ప్రపంచ వ్యాప్తంగా ఆయన అభిమానులు వైభవంగా జరుపుకొంటున్నారు. 1979 అక్టోబర్ 23న ప్రభాస్ జన్మించాడు. భీమవరంలో ప్రభాస్ సినిమా ఫ్లాప్ టాక్ వచ్చిన కోటి రూపాయలు కలెక్షన్ తగ్గదు.. అది క్రేజ్ అంటే..రెబల్ స్టార్ కృష్ణంరాజు సినీ వారసుడుగా ఈశ్వర్ సినిమాతో తన సినీ ప్రస్థానం ప్రారంభించి, వర్షం, ఛత్రపతి సినిమాల్తో స్టార్ డమ్ సాధించిన తరువాత.. బాహుబలి సిరీస్ సినిమాల తో దాదాపు 2000 కోట్ల బిజినెస్ చేసి భారతీయ సినిమా రంగంలో తెలుగు సినిమా సత్తా ప్రపంచానికి చాటిన సినీ యుగపురుషుడు ప్రభాస్. సాలార్, కల్కి 1000 కోట్ల పైగా వసూళ్ల విజయాలతో పంచవ్యాప్తంగా ప్రభాస్ కు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ఆయన సినీ హీరో మాత్రమే కాదు. ఆయన వ్యక్తిత్వానికి సామాన్యులే కాదు.. సెలబ్రెటీలు సైతం ఫిదా అవుతుంటారు. ఎంత ఎదిగిన ఒదిగి ఉండడం పేదల కోసం ఉదారంగా భారీ విరాళాలు తో స్వాందించడం ఆయన అలవాట్లు.. పాన్ ఇండియా లెవల్లో ఎన్నో రికార్డ్స్ బ్రేక్ చేసిన స్టార్ హీరో.. అయినా షూటింగ్ సెట్స్ లో చిన్నపిల్లాడే. అందరికి డార్లింగే .. గత 3 రోజులుగా భీమవరంలో అయితే ఆయన అభిమానులు పెద్ద ఎత్తున భారీ ఫ్లక్సీ లతో హడావిడి మొదలు పెట్టి నేడు, గురువారం పట్టణంలో వాడవాడలా పేదలకు అన్నదానం, వస్త్ర దానం, వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. సంక్రాంతి కానుకగా రాబోతున్న రాజా సాబ్ సినిమా ఫై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రభాస్ పౌజి, స్పిరిట్, కల్కి 2 షూటింగులతో బిజీగా ఉన్నారు.
