సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైసీపీ అధినేత ys జగన్ నేడు, గురువారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో చంద్రబాబు సారధ్యంలో కూటమి పాలన లో అంతా అస్తవ్యస్తంగా మారిందని పరిపాలన ఎక్కడ లేదని, ఇప్పటికే లక్షల కోట్ల అప్పులు తెచ్చారని ఆ డబ్బు ప్రజా సంక్షేమానికి చేరటంలేదని, ఎక్కడ చుసిన అలజడి వాతావరణం కనపడుతుందని ఉద్యోగులకు త్రిశంకు స్వర్గం కనపడుతుందని, 4 డీఏ లకు ఒక్క డీఏ కూడా కష్టంగా మారిందని, ఆరోగ్య శ్రీ నాశనం చేసారని పేదవాడి ప్రాణానికి భరోసా లేదని, ఆసుపత్రులు లో సేవలు నిలిచిపోయాయని, అందరికి బకాయిలే నని, ప్రభుత్వ పాఠశాలలు నా హయాంలో బాగుచేసే వీళ్ళు నాశనం చేసారని, విద్య వైద్యం నాశనం చేసారని విమర్శించారు. తాను విశాఖ ఆర్ధిక రాజధాని చేస్తానని ప్రకటించి భారీ నిర్మాణాలు అభివృద్ధి చేసి సదుపాయాలు కల్పించి ప్రఖ్యాత కంపెనీ ల కార్యాలయాలు ప్రారంభించి.. ఐటీ సాఫ్ట్ వేర్ రంగాలలో లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధికి అగ్రగామిగా నిలబెట్టడానికి తాను వారిని ఆహ్వానిస్తే.. అదానీ (గూగుల్) ఏ ఐ డేటా సెంటర్ కు’ కు 2023 మే 3న శంకుస్థాపన కూడా చేసాం.అదానీ గ్రూప్ తో 80 వేల కోట్ల పైగా పెట్టుబడులు పెట్టడానికి తాను సిద్ధం చేస్తే దానిని కేవలం గూగుల్ డేటా సెంటర్ గా పేరు మార్చి ఇప్పుడు చంద్రబాబు అయన కుమారుడు అవి తమ గొప్పలు గా వారి ఖాతాలో రాసుకొనే పనిలో ఉన్నారని ఎద్దేవా చేసారు. ఇప్పుడు ఆ భవనాలను ‘అదాని’నే నిర్మిస్తున్నారని, కానీ ఆయన పేరు చంద్రబాబు చెప్పలేదని విమర్శించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ జగన్ ఫై చిరంజీవి ఫై చేసిన వ్యాఖ్యలు ఎపిసోడ్ ఫై కూడా జగన్‌ తీవ్రంగా స్పందించారు. అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఏంటి.. బాలకృష్ణ మాట్లాడింది ఏంటి? అసెంబ్లీలోకి బాలకృష్ణ తాగి వచ్చి మాట్లాడారని.. తాగి వచ్చిన వ్యక్తిని అసెంబ్లీలోకి స్పీకర్ ( రఘురామా..) ఎలా అనుమతించారని? బాలకృష్ణ మానసిక స్థితి ఏంటో అక్కడే అర్థమవుతోందని.. అలా మాట్లాడినందుకు సైకలాజికల్‌ ఆరోగ్యం ఎలా ఉందో ఆయనే ప్రశ్నించుకోవాలని జగన్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *