సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైద్య రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన శాస్త్రవేత్త. భీమవరం ప్రాంత వాసి డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు కు భారతరత్న ఇవ్వాలని జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు చింతపల్లి ప్రసాదరావు డిమాండ్ చేసారు. నేడు, శుక్రవారం డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు 129వ జయంతి సందర్భంగా భీమవరం రామలక్ష్మణ నగర్ లో గల ఎల్లాప్రగడ పార్కులోని విగ్రహానికి జనవిజ్ఞాన వేదిక, నంద్యాల భాస్కర్ రాజు పూలమాల వేసిన నివాళులు అర్పించారు. గవర్నమెంట్ హాస్పటల్ వద్దని మరో విగ్రహానికి హాస్పటల్ సూపరిండెంట్ డాక్టర్ మొగిలి వీరాస్వామి మరియు టీడీపీ పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంట్ పార్ధసారధి లు పూలమాల వేసి,వారు మాట్లాడుతూ అనేక ప్రాణాంతకమైన వ్యాధులకు, పోలిక్ యాసిడ్, టెట్రా సైక్లిన, ఆ రియో మైసిన్, హట్రాజన్ మొదలగు మందులను కనిపెట్టి ప్రపంచ ప్రజలకు ప్రాణ ప్రధానం చేసి భారతదేశం కీర్తిని ప్రపంచ నలుమూల వ్యాపింప చేశారని అన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని డాక్టర్లు ప్రజలంతా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎల్లాప్రగడ ఫౌండేషన్ చైర్మన్ మెంటే సుబ్బారావు, డిఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్ కార్యదర్శి పి సీతారామరాజు, JVV నాయకులు చైతన్య ప్రసాద్, సిహెచ్ పట్టాభి రామయ్య, మల్లుల శ్రీనివాస్, చెరుకువాడ రంగసాయి, అల్లు శ్రీనివాస్ మరియు డాక్టర్లు నర్సులు హాస్పటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *