సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి జిల్లాలమీదకు మొంథా( Mondha) తుఫాన్‌ దూసుకొస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని పేరుపాలెం బీచ్ కు పర్యాటకులను నిషేదించారు. కార్తీక మాస సముద్ర స్నానాలకు వెళ్లే భక్తులకు ఇది ఇబ్బందికరమే.. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా నేడు, ఆదివారం మరింత బలపడింది. కాకినాడకు(Kakinada) 920కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. మంగళవారం ఉదయం నెల్లూరు నుండి కాకినాడ మధ్యలో తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.( భీమవరం పరిసర ప్రాంతాలలో మాత్రం మంచి ఎండ కాయడం విశేషం) మరో నాలుగు రోజులు కూడా భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం రేపు ఎల్లుండి తుపాను ప్రభావితజిల్లాలలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించే ఆలోచనలో ఉంది. ఇప్పటికే కృష్ణ జిల్లాలో ,గుంటూరు జిల్లాలో 3 రోజులు .. . 27, 28, 29న పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు 8 ఎన్డీఆర్ఎఫ్, 9 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *