సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత ఎన్నికలలో ఓటమి చెందాక వైసీపీ పార్టీకి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటున్న భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నేడు, ఆదివారం మీడియా సమావేశంలో సంచలన వ్యాక్యలు చేసారు. ఇటీవల పేకాట క్లబ్ లపై పవన్ కళ్యాణ్ ఎస్పీకి ఫోన్ చెయ్యడంతో భీమవరం నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా పేకాటలో చర్చనీయాంశం అయ్యిందన్న గ్రంధి.. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించడం అభినందనీయం అన్నారు. అయితే నిజానికి సీఎం చంద్రబాబు ఆదేశాల తరువాత గత 2 నెలలుగా భీమవరంలో పేకాట క్లబ్ లు నిలిపివేశారని , స్థానిక పోలీస్ యంత్రాంగం డిఎస్పీ జయసూర్య ఆదేశాలతో క్లబ్ నిర్వాహకులను కట్టడి చెయ్యడం తో ఇప్పుడు డీఎస్పీ పైనే పవన్ కళ్యాణ్ కు ఒక ప్రజాపతినిది పిర్యాదు చేయడంతో ఇవన్నీ తెలియని పవన్ డిఎస్పీ ఫై నివేదిక కావాలని ఎస్పీ ని ఆదేశించారని..అసలు దొంగ.. మీడియాకు, నియోజకవర్గంలో అందరికి తెలుసునని.. అధికార కూటమి చెందిన ఆ ప్రజాపతినిది ఎవరో? తెలుసునని గ్రంధి వ్యాఖ్యానించారు, ఇటీవల డిఎస్పీ నిజాయితీ ఫై రఘురామా కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు కూడా నిజమేనని అన్నారు. ఆ ప్రజా ప్రతినిధి గత 14 నెలలుగా స్థానిక క్లబ్ ల నుంచి నెలకు 10 లక్షల చప్పున , లిక్కర్ షాపుల నుండి 4న్నర లక్షల చప్పున వసూళ్లు చేస్తున్నారని, స్వంతంగా కూడా క్లబ్ నిర్వహిస్తున్నారని ప్రజలలో చర్చ జరుగుతుందని , తనకు గనక పవన్ కళ్యాణ్, అపాయింట్మెంట్ ఇస్తే ఆయనను కలసి మొత్తం వివరాలు అందిస్తానని అన్నారు. డబ్బు మామూళ్లకు అలవాటు పడిన వారి ఆదాయం గత . రెండు నెలలుగా ఆదాయం రాకపోవడంతో పోలీసు అధికారిని టార్గెట్ చేశారని చెప్పారు. పట్టణంలో గతంలో అనుమతి లేకుండా మోటారు సైకిల్ స్టాండ్ ఏర్పాటు చేసి ప్రజలనుండి నెల నెల లక్షలాది డబ్బు దోచుకొన్న వారిని నా హయాంలో ఆ దోపిడీ అడ్డ్డుకొన్నానని వివరించారు.. పేరులో ‘రామ’ అని పెట్టుకొంటే రాముడు కాదనీ , పొడుగ్గా ఉండి పెద్దమనిషి తరహాలో మెత్తగా మాట్లాడితే తెల్ల డ్రెస్ వేసుకొని మల్లి పువ్వులా ఉంటె నిజాయితీ పరుడు, మంచి మనస్సు ఉన్నవాడు కాదని గ్రంధి కోడ్ భాషలో సెటైర్ లు వేశారు. నన్ను రౌడీ అంటూ ప్రచారం చేస్తే నిజంగా రౌడీలు అయిపోతామా? మాలో మంచి మనస్సు ఉండదా? అంటూ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు గ్రంధి..
