సిగ్మా తెలుగు డాట్, న్యూస్: భారత్-అమెరికా మధ్య ట్రేడ్ ఒప్పందం కుదిరే సూచనలు తో నేడు, సోమవారం దేశంలో మెటల్, గ్యాస్, ఆయిల్ రంగాల్లో కొనుగోళ్లు దేశీయ సూచీలు భారీ లాభాలను ఆర్జించాయి. మొత్తానికి సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ముగిశాయి. గత వారం సెషన్ ముగింపు (84, 211)తో పోల్చుకుంటే నేటి సోమవారం సెన్సెక్స్ రోజంతా లాభాల్లోనే కదలాడింది. ఒక దశలో సెన్సెక్స్ 700 పాయింట్లకు పైగా లాభపడి 84, 932 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. చివరకు 566 పాయింట్ల లాభంతో 84, 778 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 170 పాయింట్ల లాభంతో 25, 966 వద్ద స్థిరపడింది. (stock market).సెన్సెక్స్‌లో బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోఫోర్జ్, బీపీసీఎల్, పీబీ ఫిన్‌టెక్, వోడాఫోన్ ఐడియా మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 548 పాయింట్ల లాభపడింది. బ్యాంక్ నిఫ్టీ 414 పాయింట్ల లాభపడింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 88.25గా నిలచింది.
