సిగ్మా తెలుగు డాట్, న్యూస్: ఏపీలో మొంథా తుఫాన్ (Cyclone Montha) ప్రభావం నేపథ్యంలో రైల్వేశాఖ అలర్ట్ అయ్యింది. తుఫాను కారణంగా ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని విశాఖ మీదుగా నడిచే 43 రైళ్లను రద్దు చేస్తున్నట్లుగా తూర్పు కోస్తా రైల్వే ప్రకటించింది. రద్దయిన రైళ్లలో గోదావరి, ఉదయ్ ఎక్స్ప్రెస్, గరీబ్ రథ్, విశాఖపట్నం తిరుపతి ఎక్స్ప్రెస్, చెన్నై సెంట్రల్ వీక్లీ ఎక్స్ప్రెస్, ఎల్టిటీతో పాటు పలు ప్రధాన రైళ్లు, పలు పాసింజర్ రైళ్లు ఉన్నాయి. నేటి నుంచి మూడు రోజుల పాటు అంటే అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో విశాఖ మీదుగా సాగే రైల్వే సర్వీసులు రద్దు అయ్యాయి. క్యాన్సెల్ అయిన రైలు సర్వీసుల జాబితాను రైల్వే శాఖ విడుదల చేసింది. తుఫాను తీవ్రతను బట్టి రైల్వే సర్వీసులను పునరుద్ధరించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. విశాఖ పట్నం నుండి అటు ఒరిస్సా వైపు రాయగడ్ , ఇటు విశాఖ నుండి కాకినాడ ,తిరుపతి , చెన్నయి వెళ్లే రైలు సర్వీసులు నిలిపివేశారు.
