సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన గత 17 నెలలు కాలంలో పలు వివాదాల్లో ఉంటూ టీడీపీ అధిష్టానానికి ధిక్కర ధోరణి లో తలనొప్పిగా వ్యవహరిస్తున్నాడంటూ వార్తలలో ఉంటున్న తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు (Thiruvur MLA Kolikapudi ) ఇటీవల తాజా వివాదాంట్లో.. తనను విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తనను 5 కోట్లు అడిగారని , వైసీపీ కౌన్సెలర్స్ ను కొనుగోలు చేశామని ఒప్పుకోవడం, బెల్టు లిక్కర్ షాపులు నిర్వహిస్తున్నారు అని సంచలన రీతిలో ప్రకటించిన నేపథ్యంలో .. కొలికపూడి , ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) లను ఇరువురిని నేడు, మంగళవారం టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఇద్దరు నేతలని పిలిపించి మాట్లాడింది. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తన వాదనని సుదీర్ఘంగా ఒక నివేదిక రూపంలో. దాదాపు నాలుగు గంటలసేపు క్రమశిక్షణ కమిటీ ముందు వివరణ ఇచ్చారు అనంతరం టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి బయటకు వచ్చాక కొలికిపూడి శ్రీనివాసరావు మీడియా తో.. ఎంపీ కేశినేని చిన్నిపై తాను చేసిన ఆరోపణలకు సంబంధించిన అనేక విషయాలకు వివరణ ఇచ్చానని తెలిపారు. తిరువూరు వివాదంపై, పార్టీ అధినేత నారా చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.అలాగే, ఈ క్రమంలోనే ఎంపీ కేశినేని శివనాథ్ కూడా తన వాదనని క్రమశిక్షణ కమిటీకి చెప్పుకున్నారు. ఇక పార్టీ అధిష్టానం నిర్ణయం ప్రకటించవలసి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *