సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఏపీలో రోడ్లు దుర్భరంగా ఉన్నాయని ప్రజలు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని మీడియా వార్తల నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కల్యాణ్ నేడు,మంగళవారం మధ్యాహ్నం ప్రభుత్వ అధికారులతో సమీక్ష సమావేశం లో మాట్లాడుతూ.. ఇటీవల రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఫై అధికారులు శ్రద్ద పెట్టాలని ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో దెబ్బతిన్న పంచాయతీరాజ్ రోడ్లను పునర్నిర్మించే కార్యక్రమం కోసం కేంద్ర ప్రభుత్వం ‘సాస్కి’ (Special Assistance to States for Capital Investment) పథకం ద్వారా 2000 కోట్ల నిధులను ఇప్పటికే సమకూర్చింది దానిని సద్వినియోగం చేసుకోవాలనిసూచించారు. ప్రజలకు ‘సాస్కి’ నిధుల ఫలాలు రోడ్ల అభివృద్ధి తో అందించాలని పంచాయతీరాజ్, ఇంజినీరింగ్ శాఖల అధికారులకి పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు సాస్కి నిధులతో నిర్మించే రోడ్లలో ఎక్కడ నాణ్యతా ప్రమాణాలు తగ్గకూడదని ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *