సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వచ్చే డిసెంబర్ 13న భీమవరం లో జరగబోయే జాతీయ లోక్ అదాలత్ లో మునుపటి కన్నా ఎక్కువ కేసులు రాజీకి ప్రయత్నం చేయాలని, రాజీ యొక్క ప్రాముఖ్యతను కక్షిదారులకు, ప్రజలకు తెలియజేయాలని” 3వ అదనపు జిల్లా జడ్జి మరియు మండల న్యాయ సేవా సంస్ధ చైర్మన్ గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి Dr.B.లక్ష్మీ నారాయణ అన్నారు. ఈ నేపథ్యంలో ఆయన నేడు, బుధవారం న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు. మీడియేషన్ కేసుల్లో న్యాయవాదులు సహకరించాలని అన్నారు. కేసు ఏ స్టేజిలో వున్నా రాజీ చేసుకోవచ్చన్నారు. అదే విధంగా రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 22న ఈ కార్యక్రమం విష్ణు ఇంజనీరింగ్ కాలేజీలో హై స్కూలు, ఇంటర్ మీడియేట్, డిగ్రీ, న్యాయ, ఇంజనీరింగ్ విద్యార్థులకు భారత రాజ్యాంగం – సామాజిక బాధ్యత అనే అంశంపై పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నామని, పాల్గొన్న విద్యార్థులకు, గెలుపొందిన విద్యార్ధులకు మెమెంటో, సర్టిఫికెట్లు జారీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) G.సురేష్ బాబు, 1వ అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) P.హనీష, 2వ అదనపు జుడీషియల్ మొదటి తరగతి మేజిస్ట్రేట్ N.జ్యోతి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు యేలేటి యోహాన్ (న్యూటన్), న్యాయవాదులు, వాలంటీర్లు పాల్గొన్నారు.
