సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికాలో నేడు, బుధవారం వెల్లడయిన పలు కీలక నగరాల మేయర్, రాష్ట్రాల గవర్నర్ ఎన్నికల ఫలితాలలో అడ్జ్యాక్షుడు ట్రంప్ కు భారీ షాక్ తగిలింది. అమెరికాలో ట్రంప్ పరిపాలనపై ప్రజా వ్యతిరేకత స్వష్టంగా కనపడింది. అయన రిపబ్లిక్ పార్టీ అభ్యర్థులు ఓడిపోగా ప్రతిపక్ష ‘డెమాక్రెటిక్’ పార్టీ అభ్యర్థులు భారీ ఘనవిజయాలు సాధిస్తున్నారు. అన్నిటికన్నా కీలకమైనది భారత సంతతికి చెందిన పలువురు మేయర్లు, గవర్నర్గ ఎన్నిక కావడం అందరిని విస్మయపరిచింది. వారు డెమాక్రెటిక్ పార్టీ తరపున గెలవడం విశేషం. న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో భారత సంతతి నేత జొహ్రాన్ మమ్దానీ విజయం సాధించిన తరువాత తొలిసారిగా ప్రసంగిస్తూ తనకు జవహర్ లాల్ నెహ్రు స్ఫూర్తి అని ఆయన మాటలను గుర్తు తెచ్చుకొన్నారు. అణచివేతకు గురైన దేశ ఆత్మ జాగృతమై తన గొంతుక వినిపించిన అద్భుత క్షణం ఇదని కామెంట్ చేశారు అధ్యక్షుడు ట్రంప్‌కు గట్టి మార్నింగ్ ఇచ్చారు.‘ట్రంప్.. మీరు ఇదంతా చూస్తున్నారని నాకు తెలుసు.ఇక ‘రాజరిక పాలన’ ను కూల్చేస్తాను అంటూ హెచ్చరించారు. వర్జీనియా స్టేట్‌ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌గా భారత సంతతి మహిళా నేత, మన హైదరాబాద్ కు చెందిన గజాలా హష్మీ విజయం సాధించారు. ట్రంప్‌కు విధానాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన గజాలా.. వర్జీనియాకు తొలి మహిళా లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌గా రికార్డు సృష్టించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *