సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలో ‘స్వర్గీయ ‘సూపర్ స్టార్ కృష్ణ కు ఇప్పటికి లక్షలాది వీరాబిమానులు ఎన్నో వందల విగ్రహాలు పెట్టారు.( ‘మహేష్’ అభిమానులు బోనస్).. మరి విశాఖపట్నంలోని జగదాంబ సెంటర్లో ఇటీవల ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆ విగ్రహం కంటే ముందు అక్కడ జనసేన జెండా ఉండేదని, అక్కడ గోడపై జనసేన పార్టీ సిద్ధాంతాలు రాసి ఉండేవని వాటికి రంగు వేశారని తుపాను సమయంలో అక్కడ అనుమతులు లేకుండా కృష్ణ విగ్రహం ఏర్పాటు చేసారని అధికారులు తొలగించాలని జనసేన స్థానిక నేతల, బొలిశెట్టి సత్యనారాయణ విజ్ఞప్తి మేరకు ఆఘమేఘాలపై అధికారులు. విగ్రహాన్ని క్రేన్ సాయంతో తొలగించారు. దీంతో అల్లూరి సీతారామరాజు వంటి చరితాత్మక సినిమా తీసి తన సాహసాలతో ప్రయోగాలతో తెలుగు సినిమా కీర్తి ప్రపంచానికి చాటిన మంచి మనిషి ని ఇలా అవమానించాలా? అని హీరో కృష్ణ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే ఇక హద్దేలేదు. అయితే విగ్రహ ఏర్పాటు.. ఇదంతా కృష్ణ అభిమానులు పని కాదని కొందరు పొలిటికల్ పెయిడ్ వ్యక్తుల పని’ అని జనసేన నేతలు అంటున్నారు.
