సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో ఇటీవల వాతావరణం మొత్తం మారిపోయింది. ఇది నిజానికి శీతాకాలం అయినప్పటికీ మంచుతెరలు ఏవి? వర్షాలు.. ఎండలు.. తీవ్ర ఉక్కబోతలు తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కోస్తా ఆంధ్ర లో పలు ప్రాంతాలలో రేపు గురువారం ఎల్లుండి శుక్రవారం ఉరుములు మెరుపులతో వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖా ప్రకటించింది. నైరుతి బంగాళాఖాతం నుంచి ఉత్తర కేరళ వరకు మధ్య తమిళనాడు మీదుగా సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తులో ఒక ద్రోణి కొనసాగుతోంది. కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళా ఖాతంలో నిన్నటి ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించి ఉంది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడనున్నాయి.
