సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: న్యూయార్క్(new-york) కొత్త మేయర్.. డెమోక్రాట్ పార్టీకి చెందిన జోహ్రాన్మామ్దానీ. ఇతను భారత మూలాలు ఉన్న వ్యక్తి. పలు అంతర్జాతీయ అవార్డులు అందుకొన్న ప్రఖ్యాత భారతీయ దర్శకురాలు మీరా నాయర్ కుమారుడు. హిందీ బాగా మాట్లాడతారు. ఒడియా కూడా మాట్లాడగలరు. మంచి వక్త అని చెబుతున్నారు. జోహ్రాన్ దాదాపు 49 శాతం ఓట్ల మెజార్టీతో న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో గెలిచారు. విజయం తర్వాత మామ్దానీ చేసిన మొట్టమొదటి ప్రసంగంలో భారత మొదటి ప్రధాని నెహ్రూ చేసిన ‘ట్రైస్ట్ విత్ డెస్టినీ’ ప్రసంగాన్ని ఉటంకించారు. న్యూయార్క్ కు ఎన్నికైన మొదటి ముస్లిం, ఏషియన్ మేయర్ గా కూడా మామ్దానీ చరిత్ర సృష్టించారు. అదొక్కటే కాదు అతి చిన్న వయసు మేయర్ గా కూడా ఈయన రికార్డ్ సాధించారు .న్యూయార్క్ ఎన్నికల్లో ఆయన భారత్ లో కర్ణాటక, తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ లలో అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ ని అక్కడ ప్రయోగించారు. మహిళలకు ఫ్రీ బస్(free-bus). తాను ఎన్నికయితే అద్దెలను తగ్గిస్తానని, పిల్లల సంరక్షణను, మెట్రో బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని సౌకర్యం కల్పిస్తానని, నగరంలో ప్రభుత్వమే నిర్వహించే కూరగాయల దుకాణాలని ఏర్పాటు చేస్తానని వాగ్ధానం చేశాడు.మరి. ప్రసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ పేరు ఉచ్చరిస్తూ తోలి ప్రసంగంలోనే ఇక ట్రంప్ రాజరికం కూల్చేస్తానని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *