సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం నందు నేడు, బుధవారం పవిత్ర కార్తీక పౌర్ణమి సందర్భంగా అర్చకులు మరియు వేదపారాయణ దారులు వైభవముగా చండీహోమం నిర్వహించారు. దేవాలయ సహాయ కమిషనర్ బుద్ధా మహాలక్ష్మి నగేష్ మన సిగ్మా న్యూస్ కు తెలిపిన వివరాలు ప్రకారం .. రేపు గురువారం (6వ తేదీ) ఉదయం 6 గంటలకు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి పాద మండల దీక్ష కార్యక్రమంలో..దేవస్థానం ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లిఖార్జున శర్మ ఆధ్వర్యంలో పలువురు శ్రీ మావూళ్ళమ్మ అమ్మవారి మాలధారణ తీసుకొంటారని మరియు ఈనెల 7 వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు శ్రీ అమ్మవారి దేవస్థాన ప్రాంగణం లో మాల దారణ దీక్షాపరులచే పెద్ద ఎత్తున ‘లక్ష దీపోత్సవ’ కార్యక్రమం వైభవముగా జరుపబడుచున్నందున భక్తులు తరలి వచ్చి.. శ్రీ అమ్మవారు ఆశీస్సులు పొందాలని తెలిపారు. ఇక, భీమవరం బలుసుమూడిలోని శ్రీమావుళ్ళమ్మ అమ్మవారికి నేడు, బుధవారం మాజీ కౌన్సిలర్ పెన్మెత్స శ్రీలక్ష్మి, శ్రీధర్ దంపతులు సుమారు రూ 1లక్ష 55 వేలు విలువ కలిగిన వెండితో తయారుచేసిన త్రిశూలంతో కూడిన హస్తాన్ని దేవస్థానంకు రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి చేతుల మీదుగా అందించారు.
