సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కార్తీక పౌర్ణమి నేపథ్యంలో పవిత్ర పంచా రామం భీమవరం గునుపూడిలో వేంచేసియున్న శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి వారి దేవస్థానం నందు ఈ కార్తీక సీజన్ లో రికార్డు స్థాయిలో నేడు,15వ రోజు బుధవారం సుమారు 15000 మంది భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకొన్నారు. నేటి తెల్లవారు జామునుండి రాత్రి వరకు ఆలయం ఆవరణ మహిళలు వెలిగించిన వేలాది జ్యోతులతో దీపోత్సవం ను తలపిస్తుంది. నేడు దర్శనముల టికెట్స్ ద్వారా రూ. 1,72,000/- రూపాయలు మరియు లడ్డు ప్రసాదం అమ్మకం ద్వారా 15 వేల రూపాయలు మొత్తం 1,87000/- వేల రూపాయలు ఆదాయం వచ్చిందని , అయితే శ్రీ స్వామివారి నిత్యాన్నదానం నందు కానుకల వలన మరో రూ- 57,636 /-రూపాయలు సమకూరాయని దేవాలయ కార్యనిర్వహణాధికారి, డి కృష్ణంరాజు ఒక ప్రకటనలో తెలిపారు. నేటి సాయంత్రం శ్రీ స్వామివారి తాజా అలంకారం ను ఫై చిత్రంలో దర్శించుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *