సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల మహిళల వన్డే ప్రపంచ కప్- 2025 ఫైనల్లో గెలిచి భారత మహిళా జట్టు తొలిసారి ప్రపంచ విజేతగా చరిత్ర సృష్టించిన నేపథ్యంలో తాజాగా.. జట్టు క్రీడాకారిణిలు ప్రధాన కోచ్ అమోల్ మజుందార్ నేతృత్వంలో ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. జట్టును మోదీ అభినందించారు. ప్రపంచ కప్లో మొదట మూడు మ్యాచ్ల్లో ఓడిపోయినప్పటికీ అనంతరం కోలుకొని టీమిండియా ధాటిగా ఆడిన తీరును గుర్తుచేసుకుని మరీ.. మోదీ వారి పట్టుదలను ప్రశంసించారు. మహిళా ప్లేయర్లతో కొద్దిసేపు మోదీ ప్రత్యేకంగా మాట్లాడారు. భారతదేశంలో క్రికెట్ అంటే కేవలం ఒక ఆట కాదని, అది ప్రజల జీవితంలో భాగమైందని ,దీనిలో యువతులు కూడా ప్రపంచ విజేతలు కావడం దేశానికీ గర్వకారణం అన్నారు
