సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమలలో తాజగా మీడియా సమావేశంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సంఘాల్ మాట్లాడుతూ.. గత అక్టోబర్ నెలలో శ్రీవారిని 22.77 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని , అలాగే శ్రీవారికి హుండీ ద్వారా రూ.119.35 కోట్ల ఆదాయం వచ్చింద్నారు. అక్టోబర్ మాసంలో 1.23 కోట్ల లడ్డూల విక్రయం జరిగిందని.. 34.20 లక్షల మంది భక్తులు ఉచిత అన్న ప్రసాదం స్వీకరించారని తెలిపారు. దాదాపు 8.31 లక్షల మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించు కున్నట్లు టీటీడీ ఈవో తెలిపారు. గత ధర్మకర్తల మండలి నిర్ణయం మేరకు ఆళ్వార్ ట్యాంక్ నుంచి గోగర్భం వరకు టాయిలెట్లు ఇతర ఖర్చుల కోసం రూ.25 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. అతి త్వరలో టీటీడీ పరిధిలో ఉన్న అన్ని ఆలయాల్లో నిత్యా అన్నప్రసాద వితరణ కు ఏర్పాట్లు చేస్తున్నామని, శ్రీవాణి ట్రస్ట్‌కు వచ్చే విరాళంలో ఆలయ నిర్మాణాల కోసం రూ.750 కోట్లు కేటాయించామని తెలిపారు. ఈనెల (నవంబర్) 17 నుంచి 25 వరకు తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *