సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ నియోజకవర్గం లో 4న్నర లక్షల మంది పాల్గొనే ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది. మరో ప్రక్క బిహార్ అసెంబ్లీ ఎన్నికలు లో చివరిది 2వ విడుత లో 122 స్థానాలకు నేడు, మంగళవారం ఉదయం 7 గంటల నుండి ప్రశాంతంగా పోలింగ్ ప్రారంభమయింది. ఈ రోజు 3 కోట్ల పైగా బీహార్ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకొనేందుకుకు పోలింగ్ నిర్వహణకు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లూ చేసింది. వివిధ ప్రధాన పార్టీల నేతలు సహా 1,302 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 45,399 పోలింగ్ కేంద్రాలను సిద్ధంచేసింది. వీటిలో 40,073 కేంద్రాలు గ్రామీణ ప్రాంతంలో ఉన్నాయి. 8,491 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. గత రాత్రి ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో అలర్ట్ అయిన కేంద్రం ఏకంగా 1000 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలు పోలింగ్ భద్రతా ఏర్పాట్లకు వినియోగిస్తున్నారు. ఈనెల 14న వెలువడే ఫలితాలు దేశరాజకీయాలను ప్రబావితమ్ చేసే అవకాశం ఉంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీయే కూటమి మరోసారి గెలిస్తే మోడీ ప్రధాన పదవికి ఢోకా ఉండదు. లేని పక్షంలో బొటాబొటి మెజారిటీతో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిలో కొన్ని పార్టీలు తిరుగుబాటు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకుల భావన..
