సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ధాన్యం అమ్మిన రైతులకు ఏ విధమైన జాప్యం లేకుండానే 24 గంటల్లోనే వారికి డబ్బు జమ కావడం జరుగుతుందని, రైతులకు అండగా కూటమి ప్రభుత్వం ఉందని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. సొసైటీ బ్యాంక్ చైర్మన్ కొట్టు సురేష్ ఆధ్వర్యంలో భీమవరం మండలం తాడేరు గ్రామంలో నేడు, మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. గన్ని బ్యాగులు ఎక్కడ కొరత లేకుండా అధికారులు చూడాలని, ఏమైనా ఫిర్యాదులు వస్తే 1967 కాల్ చేయాలని, 73373 59375 నెంబర్ వాట్సప్ లో హాయ్ పెట్టి మీకు నచ్చిన తేదీ, సమయంలో అమ్మకాలు చేయవచ్చునని అన్నారు. రైతులను నూటికి నూరు శాతం ఆదుకుంటామని ఎవరు అధైర్య పడవద్దని, గత రబీ సేవలను సీజన్లో కూడా ధాన్యం కొనుగోలు చేసి నిర్ణీత గడువు కంటే ముందుగానే ధాన్యం నగదును జమ చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో కూటమి సొసైటీ బ్యాంకుచైర్మన్లు, డైరెక్టరులు, కూటమి నాయకులు రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *