సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదాలు ప్రతి రోజు అడ్డు అదుపు లేకుండా కొనసాగుతూనే ఉన్నాయి. తాజగా నెల్లూరు జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ నగర్ వద్ద జాతీయ రహదారిపై ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేపల లోడుతో వెళ్తున్న కంటైనర్ లారీ బీభత్సం సృష్టించింది. టాటా ఏస్ వాహనంతోపాటు మూడు బైకులను ఢీకొట్టి చెట్టును ఢీకొని ఆగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు.మరో 7గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే, అక్కడ ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది వారు మరణించినట్లు తెలుస్తుంది
