సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గం తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని టిడిపి కమిటీల ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ఎల్లుండి 14వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు ‘చాంబర్ అఫ్ కామర్స్’ భవనంలో నిర్వహిస్తున్నామని నియోజకవర్గ ఇన్చార్జి పాలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి తెలిపారు. నియోజకవర్గ కార్యాలయంలో పార్టీ అధ్యక్ష కార్యదర్శుల సమావేశంలో తోట సీతారామలక్ష్మీ మాట్లాడుతూ టిడిపి సంస్థాగత ఎన్నికలలో భాగంగా నూతనంగా ఎంపికైన కమిటీలను టిడిపి రాష్ట్ర పార్టీ ఆమోదించడం జరిగిందని నియోజకవర్గంలోని వీరవాసరం భీమవరం మండలాలు మరియు భీమవరం పట్టణ గ్రామ, వార్డు,మండల,పట్టణ కమిటీల కార్యవర్గ సభ్యులు మరియు బూత్,యూనిట్, క్లస్టర్ కన్వీనర్లు కోకన్వీనర్లలు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనలని పిలుపునిచ్చారు. ఈసమావేశంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి వెండ్ర శ్రీనివాస్ వీరవాసరం భీమవరం మండలాలు మరియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు కొల్లేపర శ్రీనివాస్, వీరవల్లి శ్రీనివాస్, కొయ్యలగడ్డ గణపతి, కోళ్ల సీతారాం, మద్దుల రాము చల్లబోయిన గోవింద్, ఉప్పులూరి చంద్రశేఖర్ తదితర నేతలు పాల్గొన్నారు.
