సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ తాజాగా.. ‘క్రెడిట్ చోర్’ చంద్రబాబు’ అనే హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ చేశారు . దానిలో.. ఇటీవల చంద్రబాబు .. మీ కథ, స్క్రీ న్,ప్లే, దర్శకత్వంలో విజయవంతంగా నడుస్తున్న “క్రెడిట్ చోరీ స్కీం ’ చాలా బాగుం దం టూ ఎద్దేవా చేసారు. రాష్ట్రములో తన హయాంలో పంచి పెట్టిన పేదల కు ఇళ్ల స్థలాలను మరో మారు చంద్రబాబు తన ప్రభుత్వం పేరున ఇటీవల పంచిపెట్టేపనిలో పబ్లిసిటీ చేసుకొంటున్నారని, నిజానికి కూటమి ప్రభుత్వం వచ్చాక ‘పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఒక్క గజం స్థలం కూడా సేకరించకుండా.. ఒక్క పైసా ఖర్చు లేకుండా క్రిడిట్ కొట్టే పనిలో ఉన్నారని విమర్శించారు. అలానే మా వైసీపీ ప్రభుత్వ హయాంలో కట్టిన ఇళ్లన్నీ మేమే కట్టేశాం ”అంటూ పచ్చి అబద్ధాలను కళ్లార్పకుండా, ఏ మాత్రం సిగ్గు పడకుండా, బల్లగుద్దీ మరీ చెప్తూ…ఆ క్రెడిట్ మీదేనంటూ మీరు చేస్తు న్న క్రెడిట్ చోరీ స్కీం హేయంగా ఉంది. ఇతరుల కష్టాన్ని తన గొప్ప తనంగా చెప్పుకునేవాడు నాయకుడు కాదు .. నాటకాల రాయుడు అంటారు ’’ ఎక్స్ వేదికగా దుయ్య బట్టారు .‘మా హయాం లో 71.8 వేల ఎకరాల్లో 31.19 లక్షల ఇళ్ల పట్టాలను అక్క చెల్లెమ్మ లకు ఇచ్చి ,వారి పేరు మీదే రిజిస్ట్రే షన్ చేయించాం . 21.75 లక్షల ఇళ్లను శాంక్షన్ చేయించి…కోవిద్ ను ఎదుర్కొంటూ 9 లక్షలకుపైగా ఇళ్లను మాహయాం లోనే పూర్తి చేసిన ఘనత మాదే అన్నారు జగన్..
