సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: సినిమా హీరోల క్రేజ్ పేరు చెప్పి సినిమా టికెట్స్ ధరలు విపరీతంగా పెంచి సినీ అభిమానులనుండి కోట్ల రూపాయాలు దోచుకొంటున్న బడా నిర్మాతల పాలిట తాను సింహస్వప్నం అని ప్రకటించుకున్న ఐ-బొమ్మ (I-Bomma) నిర్వాహకుడు ఇమ్మడి రవి ని ఎట్టకేలకు హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత శుక్రవారం ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ ఇమ్మడి రవి వచ్చారు. ఈ క్రమంలో పక్కా సమాచారం అందుకున్న సీసీఎస్ పోలీసులు అతడిని అరెస్ట్ చెయ్యడం నేడు శనివారం వెలుగులోకి వచ్చింది. రవి కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐ బొమ్మ వెబ్ సైట్ ను నిర్వహించేవాడు. కొత్త సినిమా రిలీజు అయిన 24గంటల లోపే పైరసీ చేసి తన వైబ్ సైట్ లో ఉచిత ప్రదర్శనకు పెట్టేస్తుంటాడు. ఈ వెబ్ సైట్ నిండా తెలుగు సినిమాల పైరసీ(Telugu movie piracy), ఓటీటీ కంటెంట్ ఉంది. దానిపై వేసే ప్రకటనలకు భారీ మొత్తం ఆదాయం వస్తుంది. దీంతో తమ కష్టాన్ని దోచుకొంటున్నాడని ఐ బొమ్మపై ఆగ్రహంతో ఉన్న తెలుగు సినీ నిర్మాతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరెస్ట్ అనంతరం అతడి అకౌంట్లో రూ.3 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు. సర్వర్లు లాగిన్ చేయించి పైరసీ కంటెంట్ చెక్ చేశారు. అతడిని కోర్టులో ప్రవేశపెడతారని తెలుస్తోంది.
